- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
'ఆ ప్రాంతాలకు ప్రభుత్వ పథకాలు అందించడమే సర్కార్ లక్ష్యం..'

దిశ, బయ్యారం : ఏజెన్సీలోని మారుమూల గిరిజన ప్రాంతాలకు, వ్యవసాయం, రోడ్లు ఇతర మౌళిక అన్ని రంగాలను అభివృద్ధి పరచడంలో రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ముందుంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. మండలంలో గురువారం పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, పలు పనులకు భూమి పూజ కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనరసిపురం నుండి గౌరారం వెళ్లి రహదారి పై వట్టే వాగు పై బ్రిడ్జి, రోడ్డు పనులనిర్మాణంనకు నిధులకు మూడు కోట్లు మంజూరు చేసి పనులకు శిలాఫలకం ఆవిష్కరణ చేశారు. గౌరారం నుండి వినోభనగరం గురిమెల్ల వెళ్లే బీటి రహదారి నిర్మాణానికి ఒక కోటి 80 లక్షల నిధులతో భూమి పూజ చేశారు. దామర చెరువు నుండి కోటగడ్డ కు వెళ్లే ఆర్ అండ్ బి రహదారికి మూడు కోట్ల పదిలక్షల వ్యయంతో పనులు పూర్తయి బీటి రోడ్డు ప్రారంభోత్సవం గావించారు.
రామచంద్రాపురం నుండి తిమ్మాపురం వెళ్లే రహదారి పై వట్టేవాగుపై బ్రిడ్జి నిర్మాణానికి రెండు కోట్ల నిధులతో పనులు గావించి ప్రారంభోత్సవం గావించారు. మండలంలో సుమారుగా 10 కోట్ల నిధులు వెచ్చించి పనులకు ప్రారంభోత్సవాలు, శిలాఫలాలను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ బయ్యారం మండలం పూర్తిగా ఏజెన్సీ మండలం రెండు పంటలు పండితేనే కుటుంబాలు ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని ఇక్కడ ఒకటే పంట పండటంతో ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఇల్లెందు శాసనసభ్యులు కోరం కనకయ్య సహకారంతో దేవాదుల ఎత్తిపోతల ద్వారా నీళ్లు పాకాల సరస్సుకు, పాకాల చెరువు లిఫ్ట్ ద్వారా పంది పంపులవాగులో వేసి, గ్రావిటీ ద్వారా నీరు బయ్యారం చెరువుకు రప్పించి అభివృద్ధి పరుస్తామని, రెండు పంటలు పండే విధంగా ఇక్కడ ప్రాంత ప్రజలకు అభివృద్ధి పరిచేందుకు నా నియోజకవర్గంలో పాటు ఇల్లందు నియోజకవర్గంలో కూడా ఒక కంట కనిపెడుతూ అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు.
ఏజెన్సీ గ్రామాలకు రేవంత్ సర్కార్ ఐటీడీ నిధులు 17,000 కోట్లు వెచ్చించిందని, ఆ నిధులతో ఈ ప్రాంత రోడ్లు తదితర అంశాలపై సమగ్ర విచారణ చేసి ఈ ప్రాంతంను అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్లు బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా కృషి చేస్తామని ఎవరు కూడా రేవంత్ సర్కార్లు అధైర్యపడవద్దని వెనకా ముందు పథకాలు అందరికీ వర్తిస్తాయని తెలిపారు. ఓసి వర్గాలలో కూడా కటిక పేదవారు ఉన్నారని, వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఏజెన్సీలోని పోడు రైతులకు త్రీఫేస్ కరెంటు అందే విధంగా కృషి చేస్తామని, దానికి తోడు సోలార్ విద్యుత్ , పంపు సెట్లను ప్రతి పోడు సాగు రైతులకు అందించే విధంగా తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
మండలంలోని తిమ్మాపురం గ్రామానికి నాకు విడదీయరాని సంబంధం ఉందని, రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ శంకుస్థాపనలకు వచ్చి మీ ఆశీర్వాదం తీసుకొని మీతో ముచ్చటిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, తహశీల్దార్ బి. విజయ, ఎంపీడీవో విజయలక్ష్మి, బయ్యారం సొసైటీ చైర్మన్, ఐటీడీఏ డిఇ చందర్ శ్రీనివాస్, ఆర్ అండ్ బీ డీఈ,ఏఇ, పంచాయతీ రాజ్ శాఖ ఈఇ, డీఇ,ఏఇ, జిల్లా ఎస్పీ సుదీర్ రాంనాథ్ కేకన్, ఆర్డిఓ కృష్ణవేణి, డీపీఆర్ఓ రాజేంద్ర ప్రసాద్, డీఎస్పీ తిరుపతి, ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.