చిత్తూరు జిల్లాలో మృత్యుంజయుడు.. 103 సార్లు పాము కరిచినా బ్రతికి బట్ట కట్టిన సుబ్రమణ్యం

by Ramesh Goud |
చిత్తూరు జిల్లాలో మృత్యుంజయుడు.. 103 సార్లు పాము కరిచినా బ్రతికి బట్ట కట్టిన సుబ్రమణ్యం
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా (Chittor District), బైరెడ్డి పల్లి మండలంలో (Bireddy pally Mandal) ఓ వ్యక్తి వరుస పాము కాట్లతో మృత్యుంజయుడు అయ్యాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఆ వ్యక్తిని ఏకంగా 103 సార్లు పాములు కాటు (103 Snake Bites) వేసిన బ్రతికి బట్ట కట్టాడు. బైరెడ్డి పల్లి మండలం కుమ్మరికుంట (Kummari Kunta) గ్రామానికి చెందిన సుబ్రమణ్యం అనే వ్యక్తి వింత సమస్యతో బాధపడుతున్నాడు. అతడు 5వ తరగతి చదివే సమయం పాములు కాటు వేయడం ప్రారంభించాయని, ఇప్పటివరకు దాదాపు 103 సార్లు పాము కాటుకు గురయ్యాయనని, ప్రతీసారి ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవడంతో బ్రతుకుతున్నానని చెబుతున్నాడు. గతంలో ఆరు నెలలకు, సంవత్సరానికి ఒకసారి కాటు వేసే పాములు 2014 నుంచి ప్రతీ అమవాస్యకు, పౌర్ణమికి కాటు వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు.

దీనిపై ఎంతో మంది డాక్టర్ల దగ్గర పరీక్షలు చేయించుకున్నానని, ఎన్నో దేవాలయాలు తిరిగినా పాము కాటు నుంచి తప్పించుకునే మార్గం దొరకలేదని చెబుతున్నారు. ఈ పాము కాట్ల వల్ల ఆసుపత్రులకు ఎంతో డబ్బు ఖర్చు చేశానని అన్నాడు. గతంలో కూలీ పనికి వేళ్లే వాడ్ని అని, పాము కాట్ల కారణంగా ఇప్పుడు కూలీ పనికి కూడా ఎవరు పిలవడం లేదని వాపోతున్నాడు. తన వద్దకు రావాలంటే కూడా.. పాములు వస్తాయేమోనని భయపడుతున్నారని తెలిపాడు. ప్రస్తుతం తనకు భార్య పిల్లలు ఉన్నారని, ఉపాధి లేక వారిని సాకే పరిస్థితి కూడా లేదని చెప్పాడు. దయచేసి ప్రభుత్వం తనను ఆదుకోవాలని, లేకుంటే ఆత్మహత్యే శరణ్యం అని అన్నాడు. అయితే పాములు సుబ్రమణ్యం ను పగబట్టి కాటు వేస్తున్నాయా..? లేక ప్రమాదవశాత్తు కాటుకు గురి అవుతున్నాడా..? అనేది ప్రశ్నార్థకంగా మారిందని గ్రామస్థులు చెబుతున్నారు.

Next Story

Most Viewed