- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు : ఎమ్మెల్యే

దిశ, నారాయణఖేడ్: అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. గురువారం మనూర్ మండల పరిధిలోని దుద్దగొండ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే పట్లోళ్ల డాక్టర్ సంజీవరెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకలలో ఒకటి ఇందిరమ్మ ఇండ్లు అని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇండ్ల ద్వారా రూ.5 లక్షలు ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు, అర్హులైన ప్రతి ఒక్కరూ పథకం ఉపయోగించుకోవాలని అన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందన్నారు. గత పది సంవత్సరాల నుంచి నిరుపేదలకు ఇల్లు ఇవ్వకుండా మోసం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ రాజు, బ్రహ్మానంద రెడ్డి, మాజీ సర్పంచ్, సిద్దా రెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, శివకాంత్ పాటిల్, శివాజీ పాటిల్, దూదగొండ గ్రామ ప్రజలు పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.