- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కేటీఆర్ కు స్వాగతం పలికిన బీఆర్ఎస్ నాయకులు..

దిశ, భూదాన్ పోచంపల్లి : బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల విజయానికి దిశ నిర్దేశం చేసేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సూర్యాపేటలో ముఖ్యకార్యకర్తల సమావేశానికి వెళ్తున్న నేపథ్యంలో గురువారం భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భూదాన్ పోచంపల్లి మండల బీఆర్ఎస్ నాయకులు కొత్తగూడెం ఎక్స్ రోడ్ వద్ద ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు పుష్పగుచ్చం అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు.
అనంతరం సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల్లో చేనేత సమస్యల పై మాట్లాడాలని వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కోట పుష్పలత మల్లారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పాక వెంకటేశ్ యాదవ్, మాజీ వైస్ చైర్మన్ భాత్క లింగస్వామి, పీఎసీఎస్ చైర్మన్ కందాడి భూపాల్ రెడ్డి, నాయకులు ముత్యాల మహిపాల్ రెడ్డి, పగిళ్ల రామ్ రెడ్డి, సీత శ్రవణ్, చింతకింది కిరణ్, కొయ్యడ అరుణ్ తదితరులు పాల్గొన్నారు.