మునగాకును ఇలా వాడారంటే అసూయపడే అందం మీ సొంతం..!!

by Anjali |   ( Updated:2024-10-17 14:53:49.0  )
మునగాకును ఇలా వాడారంటే అసూయపడే అందం మీ సొంతం..!!
X

దిశ, వెబ్‌డెస్క్: మునగాకు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. ఈ ఆకులో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.అంతేకాకుండా మునగాకులోని ఔషధ గుణాలు జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. ఉబ్బసం, కీళ్లనొప్పులు వంటి సాధారణ వ్యాధులకు నయం చేయడంలో మేలు చేస్తుంది. మనగాకులు ఊబకాయం, వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

యవ్వనమైన అందం మీ సొంతం..

అయితే ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఫేస్ పై పింపుల్స్ తో బాధపడుతోన్న విషయం తెలిసిందే. ముఖంపై మొటిమలు ఉండడం వల్ల అందం కాస్త తగ్గినట్లు కనిపిస్తుంది. అయితే పింపుల్స్ కు చెక్ పెట్టాలంటే మునగాకుల్ని రోజు మీ ఆహారంలో భాగం చేసుకుంటే సరిపోద్ది. మునగాకులో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాలు వృద్ధాప్యాన్నిఎదుర్కోవడానికి సహాయపడుతుంది. యవ్వనమైన చర్మాన్ని ఇస్తుంది.

మృతకణాలను తొలగించడంలో మేలు..

మార్కెట్‌లో దొరికే మునగాకుల రసం రాత్రిపూట ఫేస్‌కు అప్లై చేస్తే పింపుల్స్ తగ్గుతాయి. మనగాకులను పేస్టులా చేసి ముఖానికి రాస్తే కూడా మృతకణాలు తొలగిపోతాయి. ఇలా వారినికి రెండు సార్లు మునగాకుల పొడితో ఫేస్ శుభ్రం చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed