- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కళ్లలో టాటూ వేయించుకున్న ఆస్ట్రేలియన్ మోడల్..
దిశ, ఫీచర్స్: పిచ్చి పీక్స్‌కు వెళ్లింది అంటే ఇదేనేమో. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు చెందిన మోడల్ అంబర్ ల్యూక్ 98శాతం శరీరాన్ని టాటూ చేయించుకుంది. బాడీలో 'ఇంచు గ్యాప్ లేకుండా.. ఇంక్ చేయించడమే లక్ష్యం' అంటున్న భామ ఈ క్రమంలో ఎన్ని కష్టాలొచ్చినా 'తగ్గేదేలే' అంటోంది. కళ్లు పోయినా పర్వాలేదు.. 'ఐ బాల్'కు టాటూ వేయించుకుంటానని పట్టుబట్టిన మోడల్.. ఐదేళ్ల క్రితమే ఆ పని చేసేసింది. డాక్టర్స్ ముందుగా చెప్పినట్లుగానే కొద్ది రోజులు అంధురాలిగా బాధలను ఎదుర్కొంది. ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న భామ.. ఇందుకు సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేసింది.
'ఐ బాల్స్లోకి సిరంజి ఇంజెక్షన్లు ఇవ్వడమనేది టార్చర్ ప్రాసెస్. పది గాజు ముక్కలు పట్టుకుని నా కంటికి రుద్దినట్లు అనిపించింది. బ్లూ కలర్ కన్నీరు రాల్చడం నా ఒక్కదానికే సొంతమైందేమో. అయినా నాకు ఎలాంటి రిగ్రెషన్ లేదు' అని పేర్కొంది. ఇక ఏడేళ్ల బాడీ ట్రాన్స్ఫర్మేషన్లో 600 టాటూలు వేయించుకున్న అంబర్.. ఇందుకోసం ఏకంగా రూ.2 కోట్లు వెచ్చించడం విశేషం.