- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనుమతుల్లేని సర్వేలను అడ్డుకుంటే రైతులపై కేసులా...? : ఎమ్మెల్సీ
దిశ, రామడుగు : అనుమతి లేని వరద కాలువ నిర్మాణం కోసం భూముల సర్వే చేస్తున్న అధికారులను అడ్డుకుంటే రైతులపై కేసులు పెట్టడం దారుణమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం గంగాధర మండలంలోని కురిక్యాల గ్రామంలో కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మద్దతు తెలిపిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పర్యావరణ కేంద్ర జలసంఘం ఎలాంటి అనుమతులు లేకుండా, రైతుల సమ్మతి కూడా లేకుండానే.. అక్రమంగా పంట పొలాల దగ్గరికి వచ్చి సర్వే చేయడం ఏమిటి అని ప్రశ్నించిన రైతులపై కేసులు పెట్టడం సరైన పద్ధతి కాదని అన్నారు. అదనపు టీఎంసీ కాలువ నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న గంగాధర, బోయినపల్లి, రామడుగు మండలాల రైతులు ఆవేదనతో మనస్థాపం చెంది గుండెపోటుతో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని, అలాగే వరద కాలువ నిర్మాణం ఆపాలన్నారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మేడిపల్లి సత్యం, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.