బాపు కలలు కన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యం: ప్రధాని

by Harish |
బాపు కలలు కన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యం: ప్రధాని
X

అహ్మాదాబాద్: గ్రామ స్వరాజ్యం కల నెరవేరాలంటే పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మనమంతా మహత్మా గాంధీ కలలను పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. గుజరాత్ అహ్మదాబాద్‌లోని ప్రజాప్రతినిధులు హజరైన మహా పంచాయత్ సమ్మేళన్ లో శుక్రవారం ఆయన ప్రసంగించారు. 'గుజరాత్ బాపు, సర్దార్ వల్లభభాయి పటేల్‌ల భూమి. మహాత్ముడు ఎల్లప్పుడూ గ్రామీణ అభివృద్ధి, స్వావలంబన గురించి మాట్లాడేవారు. నేడు అమృత్ మహోత్సవ్‌లో భాగంగా బాపు కలలు గన్న గ్రామీణ్ వికాస్ మనం నేరవేర్చాలి' అని అన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థ గ్రామ స్వరాజ్యాన్ని చేరుకోవడంలో చాలా ముఖ్యమైనదని చెప్పారు. ఈ వ్యవస్థకు దిశానిర్దేశం చేసేలా ప్రజాప్రతినిధులు, పంచాయతీ సర్పంచ్‌లు అందరూ పని చేస్తున్నారని అన్నారు. గుజరాత్ లో పంచాయతీ వ్యవస్థలో పురుషుల కన్నా మహిళల ప్రాధాన్యతే ఎక్కువగా ఉందన్నారు. గుజరాత్ ఉజ్వల భవిష్యత్తు గురించి 1.5లక్షలకు పైగా ప్రజా ప్రతినిధులు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. కరోనా సమయంలో గ్రామ ప్రతినిధులు చేపట్టిన చర్యలను ప్రధాని ప్రశంసించారు.


మోదీకి గ్రాండ్ వెల్‌కం

అంతకుముందు శుక్రవారం ఉదయం గుజరాత్ చేరుకున్న మోదీ ఎయిర్ పోర్ట్ నుంచి కమలం (బీజేపీ కార్యాలయం) వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, ప్రజల నుంచి ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా రోడ్ షో ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు నాలుగు లక్షల మంది ఈ రోడ్ షో‌లో పాల్గొన్నారు. ఓపెన్ టాప్ వాహనంలో ఆయన ప్రజలకు రోడ్డు వెంబడి అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

Advertisement

Next Story

Most Viewed