Tulasi plant: ఎండిన తులసి మొక్క కాండం-ఆకులతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

by Anjali |   ( Updated:2024-10-16 16:01:03.0  )
Tulasi plant: ఎండిన తులసి మొక్క కాండం-ఆకులతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: తులసి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. తులసిలో యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటిట్యూసివ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి దగ్గు నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. తులసి ఆకులను తేనెతో కలిపి తింటే కూడా దగ్గు అండ్ ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి రోగనిరోధక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇక తులసి మొక్క అందరి ఇంట్లో ఉంటుంది. అయితే తులసి ఎండిన ఆకు నుంచి కాండం వరకు ఎన్నో లాభాలున్నాయంటున్నారు నిపుణులు. ఎండిపోయినా కూడా తులసి మొక్కను ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో ఇప్పుడు తెలుసుకోండి.

ఎండిన ఆకులతో లాభాలు..

తులసి ఎండు ఆకుల్ని మిక్సీ గ్రైండర్పట్టి గాలి చొరవని డబ్బాలోవేసి హెర్బల్ టీ లేదా కషాయం తయారీకి వాడొచ్చు. ఇది ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో ఎంతో మేలు చేస్తుంది. శీతాకాలంలో కోల్డ్ ను దూరం చేస్తుంది. ఫేస్ ప్యాక్స్ కోసం కూడా తులసి ఆకుల్ని వాడుతారు.

సువాసనతో పాటు ఇంటి మొత్తాన్ని..

తులసి కాండాన్ని కూడా ఎన్నో విధాలుగా వాడవచ్చు. ముందుగా తులసి కాండాలకు ఆకులు లేకుండా చేసి.. చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంట్లో ఏదైనా పూజ చేస్తున్నప్పుడు హోమం చేసేటప్పుడు ఈ కర్రల్ని ఉపయోగిస్తే అంతా మంచే జరుగుతుంది. సువాసనతో పాటు ఇంటి మొత్తానికి సానుకూల శక్తిని తెచ్చిపెడుతుంది.

క్రిములను తరిమికొట్టడంలో తులసి కాండం మేలు...

తులసి కాండం కట్టెల్ని కాల్చినప్పుడు తులసిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇంట్లో ఉండే క్రిములను తరిమికొడతాయి. అంతేకాకుండా ఎండిన తులసి కాండాన్ని గంధంలా కూడా ఉపయోగించుకోవచ్చు. తులసి కలపను వాటర్‌లో మరిగించి హెర్బల్ టీ రెడీ చేసుకోవచ్చు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story