- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరుగునపడిన చరిత్రను వెలుగులోకి తెద్దాం: జూలూరు
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఎంతోమంది వీరులు, సాహితీ వేత్తలకు, సంస్కృతి, సాంప్రదాయాలకు తెలంగాణ పుట్టినిల్లు అని, మరుగునపడ్డ అన్ని కళలను వెలుగులోకి తీసుకొచ్చి ప్రజలలోకి తీసుకెళ్ళడమే తెలంగాణ సాహిత్య అకాడమీ ధ్యేయమని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని లుంబినీ హైస్కూళ్లో పాలమూరు సాహితీ వారు నిర్వహించిన 'ఉగాది కవి సమ్మేళనం' కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన జూలూరు గౌరీశంకర్ ముందుగా అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని పెంచేందుకు వీలుగా రాష్ట్ర సాహిత్య అకాడమీని ఏర్పాటు చేశారని చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయడానికి ఈ సంస్థ కృషి చేస్తున్నదన్నారు. మరుగునపడిన సాహిత్యాన్ని, చరిత్రను తెలుగులోకి తీసుకురావడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని జూలూరు వెల్లడించారు. సాహితీవేత్తలే కాకుండా విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులందరినీ చరిత్రను వెలుగులోకి తీసుకురావడానికి భాగస్వాములు చేస్తున్నామని వెల్లడించారు. ఇటీవల 29 వేల పాఠశాల్లో మన ఊరు- మన చెట్టు అనే అంశంపై ఐదు లక్షల మంది విద్యార్థులు కథలు రాశారని ఆయన తెలిపారు.
ఇటీవల నల్గొండ జిల్లాలో ఒక కార్యక్రమానికి వెళ్లినప్పుడు 1500 మంది విద్యార్థులు తమ సొంత ఊర్లకు సంబంధించిన చరిత్రను రాయడానికి ముందుకొచ్చారన్నారు. ఇలా ప్రతి ఒక్కరూ తమ గ్రామాలు, మండలాలు, పట్టణాల చరిత్రలను రాస్తే అవన్నీ కలిసి మహాగ్రంథాలుగా, సాహితీసంపదలుగా ఏర్పడతాయన్నారు. బియ్యం శాస్త్రి రచించిన మహబూబ్ నగర్ జిల్లా సర్వస్వము, ఉమ్మడి నల్గొండ జిల్లా సర్వస్వము వంటి రచనలను కోటి మంది విద్యార్థులు, యువతలోకి తీసుకెళ్లడానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సాహిత్య సంపదను విస్తృత పరచడానికి ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు జిల్లా కేంద్రానికి వచ్చిన సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్‌కు సమాచార శాఖ సహాయ సంచాలకులు వెంకటేశ్వర్లు పూల బొకేలు అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాలలో ఉమ్మడి పాలమూరు జిల్లా సాహితీవేత్తలు కోట్ల వెంకటేశ్వర రెడ్డి, భీంపల్లి శ్రీకాంత్, బాపట్ల సుబ్బయ్య, కపిలవాయి అశోక్ బాబు, పుట్టి గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.