వీరమళ్ల ప్రకాష్‌రావు పదవీకాలం పొడిగింపు

by GSrikanth |
వీరమళ్ల ప్రకాష్‌రావు పదవీకాలం పొడిగింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ వాటర్​రిసోర్స్​డెవలప్‌మెంట్​కార్పొరేషన్​చైర్మన్​వీరమళ్ల ప్రకాష్‌రావు పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రకాష్ రావు‌ను జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌‌గా ప్రభుత్వం 2017 మార్చి 1న మూడేండ్ల కాలపరిమితితో నియమించింది. ఆ తర్వాత 2020లో ఏడాది పాటు, 2021లో మరో ఏడాది పాటు పొడిగించింది. తాజాగా గడువు ముగియడంతో మరోసారి ఏడాది పొడిగిస్తూ.. రజత్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 1వ తేదీ నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న జీతభత్యాలు, నియమ నిబంధనలన్నీ వర్తిస్తాయని తెలిపారు. ఏడాదికాలం లేదా తదుపరి ఉత్తర్వులు ఈ రెండింటిలో ఏది ముందుగా వస్తే అప్పటి వరకూ ఆయన పదవిలో కొనసాగుతారని స్పష్టం చేశారు.

Advertisement

Next Story