- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'అండగా నిలవాల్సిందిపోయి.. అమ్ముడుపోవడం విడ్డూరంగా ఉంది'
దిశ, దేవరుప్పుల: కేంద్ర ప్రభుత్వం అడ్డు అదుపు లేకుండా సామాన్యులపై పెను భారం వేస్తూ గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలను విపరీతంగా పెంచుతుందని.. వాటిని వెంటనే తగ్గించాలని కోరుతూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశానుసారం దేవరుప్పుల మండల వ్యాప్తంగా గ్రామగ్రామాన మహిళలు కదం తొక్కారు. గురువారం దేవరుప్పల మండల కేంద్రంలో సర్పంచ్ ఈదునూరి రమాదేవి ఆధ్వర్యంలో, కడవెండి సర్పంచ్ పోతిరెడ్డి బ్లేతినా లీనారెడ్డి ఆధ్వర్యంలో, నీర్మాల జడ్పీటీసీ పళ్ల భార్గవి సుందర్ రామ్ రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డిగూడెంలో, సర్పంచ్ బిల్లా అంజమ్మ యాదవ రెడ్డి ఆధ్వర్యంలో సీతారామపురం గ్రామంలో, ఎంపీపీ బస్వ సావిత్రి మల్లేశ్ కోలుకొండలో సర్పంచ్ కుర్నాల రవి ఆధ్వర్యంలో, పెద్దమడూర్ లో సర్పంచ్ ఆకవరం సుజనా పెద్దారెడ్డి ఆధ్వర్యంలో మహిళలు పెద్దఎత్తున నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన నిత్యావసర సరుకులు, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. మహిళలు గ్యాస్ గ్యాస్ బండ లను ప్రదర్శిస్తూ, బైక్ లను, ఆటోలను చేతులతో లాగుతూ కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వనికి మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా జడ్పీటీసీ పల్లా భార్గవి ఎంపీపీ భస్వ సావిత్రి, మహిళా ప్రజాప్రతినిధులు, నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తుందని.. నిత్యావసర సరుకులను అడ్డుఅదుపు లేకుండా పెంచి పేదలపై పెనుభారం మోపుతుందని అన్నారు. దీంతో దేశవ్యాప్తంగా పేదరికం పెరిగే అవకాశం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం పేదలకు అండగా నిలవాల్సిందిపోయి కార్పొరేట్ శక్తులకు అమ్ముడు పోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. పంజాబ్ తరహాలో తెలంగాణలో పండించిన ప్రతి గింజను కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని లేని పక్షంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్, సర్పంచ్ లు రెడ్డి రాజుల రమేష్, వర్రె మధు, కోక్యానాయక్, బానోత్ రాజన్న నాయక్, బానోత్ గెమా నాయక్, గుగూలోత్ సునీత ఆంజనేయులు, ఎంపీటీసీలు పానుగంటి గిరి, దుబ్బాక కవిత రత్నాకర్ ర్రెడ్డి, వైస్ ఎంపీపీ కత్తుల విజయ్ కూమార్, మెడ కల్యాణి వెంకటేష్, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు మహిళలు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.