Balakrishna: ‘డాకు మహారాజ్’ బాలయ్య కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రంగా నిలుస్తుంది: నాగవంశీ

by Hamsa |
Balakrishna: ‘డాకు మహారాజ్’ బాలయ్య కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రంగా నిలుస్తుంది: నాగవంశీ
X

దిశ, సినిమా: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ‘డాకు మహారాజ్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం బాబీ కొల్లి(Bobby Kolli) దర్శకత్వంలో రాబోతుండగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌(Sitara Entertainments), ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ(Naga Vamsi), సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ క్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ పాత్రికేయుల సమావేశం నిర్వహించింది.

ఇందులో నాగవంశీ మాట్లాడుతూ.. ‘‘జనవరి 9న అనంతపురంలో భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశాం. ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj)సినిమాను తెలుగునాట కావాల్సినన్ని థియేటర్లలో భారీగా విడుదల చేస్తున్నాం. యూఎస్‌లో కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది. తెలుగుతో పాటు తమిళ్‌లోనూ జనవరి 12న విడుదలవుతోంది. ఈ సంక్రాంతికి ఘన విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు బాగుంటాయి. నేను చూసి నమ్మకంగా చెబుతున్నాను. ‘డాకు మహారాజ్’ చిత్రం అసలు నిరాశ పరచదు. బాలకృష్ణ(Balakrishna) కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది’’ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed