KF beer bandh: కేఎఫ్ బీర్ల బంద్‌పై ప్రభుత్వం ఆగ్రహం.. వైన్స్ లకు హెచ్చరిక

by Prasad Jukanti |
KF beer bandh: కేఎఫ్ బీర్ల బంద్‌పై ప్రభుత్వం ఆగ్రహం.. వైన్స్ లకు హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రానికి కింగ్‌ఫిషర్(Kingfisher), హీనెకెన్ బీర్ల (KF Beers) అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు యూనైటెడ్ బ్రేవరేజెస్ లిమిటెడ్ (యూబీఎల్) (United Breweries Limited) ప్రకటన చేయడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. తమను సంప్రదించకుండానే సరఫరా నిలిపివేస్తామని ప్రకటించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. కేఎఫ్ బీర్ల సరఫరా ఆగిపోతుందన్న నెపంతో వైన్స్ యజమానులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సర్కార్ హెచ్చరించింది. అధిక ధరలకు బీర్లు విక్రయిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించింది. కాగా 2019 నుంచి ధరలను సవరించకపోవడంపై, బీసీఎల్ బకాయిలు చెల్లించకపోవడంతో తమకు భారీ నష్టాలు వస్తున్నాయని పేర్కొంటూ తెలంగాణకు బీర్ల సరఫరా బంద్ చేస్తున్నామని యూబీఎల్ ప్రకటించింది. కాసేపట్లో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాకు వివరాలు వెల్లడించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed