Smartphone: ప్రతీ నాలుగు నిమిషాలకొకసారి ఫోన్ చెక్ చేసుకుంటున్నారా..?

by Anjali |
Smartphone: ప్రతీ నాలుగు నిమిషాలకొకసారి ఫోన్ చెక్ చేసుకుంటున్నారా..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో జనాలు స్మార్ట్‌ఫోన్‌(Smartphone)కు ఏ విధంగా అడక్ట్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. మనిషి జీవితంలో ఫోన్ ఓ భాగమైపోయింది. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్మార్ట్ మొబైల్స్ ను విపరీతంగా వాడుతున్నారు. ఎవరిని చూడు చేతిలో మొబైల్‌తో కనిపిస్తున్నారు.

అన్నం లేకుండా అయినా బతకగలుగుతారు కానీ.. సెల్ ఫోన్ లేనిది మాత్రం మనుషులు బతకలేని పరిస్థితి నెలకొంది. చివరకు భోజనం చేసినా వాష్ రూమ్ కు వెళ్లినా వెంబడే ఫోన్ తీసుకుని వెళ్తున్నారు. అయితే ఫోన్‌తో ఉపయోగాలున్నప్పటికీ ‌నష్టాలు కూడా ఉన్నాయని తరచూ నిపుణులు చెబుతూనే ఉంటారు. అయితే స్మార్ట్ ఫోన్ ను ప్రతీ నాలుగు నిమిషాలకొకసారి చెక్ చేసుకున్నట్లైతే.. ఆరోగ్యానికి హాని అని నిపుణులు చెబుతున్నారు.

పదే పదే సెల్ ఫోన్ ను చూడడం వల్ల మైండ్ మీద ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు. స్మార్ట్ మొబైల్‌పై తప్ప మరే ఇతర పనులపై ఫోకస్ చేయలేకపోతున్నారు. అంతేకాకుండా కొత్త రకం అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు సర్వేలో వెల్లడైందని నిపుణులు చెబుతున్నార. మనిషిలో జ్జాపకశక్తి(Momory Loss) క్షీణిస్తుందని అధ్యయనంలో బయటపడిందని అంటున్నారు. కాగా రోజులో ఎంత తక్కువ ఫోన్ వాడితే అంత మంచిదని సూచిస్తున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed