Aishwarya Rajesh: ఇలాంటి క్యారెక్టర్ ఇప్పటివరకూ చేయలేదు.. ఐశ్వర్య రాజేష్ ఆసక్తికర కామెంట్స్

by Hamsa |   ( Updated:2025-01-08 15:43:27.0  )
Aishwarya Rajesh: ఇలాంటి క్యారెక్టర్ ఇప్పటివరకూ చేయలేదు.. ఐశ్వర్య రాజేష్ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: విక్టరీ వెంకటేష్ (Venkatesh), బ్లాక్ బస్టర్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ( Anil Ravipudi) కాంబోలో రాబోతున్న తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam). దీనిని మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ (Sri Venkateswara Creations) పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhury), ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. జనవరి 14న ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) విలేకరుల సమావేశంలో పలు విశేషాల్ని పంచుకున్నారు. ‘‘భాగ్యం క్యారెక్టర్ కోసం చాలా వెతికారు. ఆ పాత్ర నాకు దక్కడం ఆనందంగా వుంది. ఇప్పటివరకూ చాలా సినిమాలు చేశాను.

కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చాలా స్పెషల్. తెలుగులో నాకు ఇప్పటివరకూ సరైన డ్యూయెట్ సాంగ్ పడలేదు. ఆ లోటు గోదారి గట్టు(Godari Gattu Meeda Song) పాటతో తీరింది. వెంకటేష్ లాంటి బిగ్ హీరోతో ఇంత అద్భుతమైన సాంగ్ చేయడం అది ఇంత వైరల్ హిట్ కావడం ఆనందంగా ఉంది. ఇది అందరూ ఎంజాయ్ చేసే సినిమా. బిగినింగ్‌లో చాలా భయం వేసింది. ఎందుకంటే భాగ్యం.. మామూలు క్యారెక్టర్ కాదు. కత్తిమీద సాములాంటి క్యారెక్టర్. కొంచెం బ్యాలెన్స్ తప్పినా కష్టమే. ఇంతకుముందు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. ఆడియన్స్ చూస్తున్నప్పుడు జాలి పుట్టే క్యారెక్టర్. చాలా క్రూసియాల్ రోల్. కాస్త శ్రుతిమించిన ఓవర్ డోస్ అయిపోతుంది. భాగ్యం పాత్రని అర్ధం చేసుకోవడానికి నాకు పదిరోజులు పట్టింది’’ అని చెప్పుకొచ్చింది.


Read More ...

Kiara Advani: ‘అవి మన విజయానికి మార్గం కాదు’.. కియారా అద్వానీ కీలక వ్యాఖ్యలు



Next Story

Most Viewed