Life of Ram Song: జీవిత అర్థాన్ని చెప్పే పాట.. సిరివెన్నెల కలం నుంచి జాలువారిన ఈ సూపర్‌ హిట్‌ సాంగ్‌కు రికార్డ్ వ్యూస్‌

by Vennela |
Life of Ram Song: జీవిత అర్థాన్ని చెప్పే పాట.. సిరివెన్నెల కలం  నుంచి జాలువారిన ఈ సూపర్‌ హిట్‌ సాంగ్‌కు రికార్డ్ వ్యూస్‌
X

దిశ,వెబ్ డెస్క్: Life of Ram Song: జాను ఈ మూవీ వచ్చి 5ఏళ్లు గడించింది. అయినా ఈ మూవీలోని లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ కు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. కథనాయకుడి ఒంటరి ప్రయాణాన్ని వివరిస్తూ సాగే ఈ పాటకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ పాటలో హీరో పర్సనాలిటీకి చాలా మంది వ్యక్తిగతంగా కనెక్ట్ అవ్వడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. 2020 ఫిబ్రవరిలో యూట్యూబ్ లో పోస్టు చేసిన ఈ వీడియో సాంగ్ కు ఇప్పటి వరకు 22కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. శర్వానంద్, సమంత జోడిగా నటించిన జాను మూవీలోని ఈ పాటకు దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన ఓ మేలిమి ఆణిముత్యం ఇది. ఎన్నో అద్భుతమైన పాటలకు సాహిత్యాన్ని అందించి దివికెగిన సిరివెన్నెల..ఈ లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ తో మరో మెట్టు పైకెక్కేశారనే చెప్పవచ్చు. ఈ పాటలోని ప్రతి పదానికి ఉండే అర్థం ప్రేక్షకుల మనస్సులోకి చొచ్చుకుపోతోంది.

ఆ పాట లిరిక్స్ మీకోసం..


పల్లవి:

ఏదారెదురైనా ఎటువెళుతుందో అడిగానా

ఎం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్న

ఎం చూస్తూ ఉన్నా నే వెతికాన ఏదైనా

ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్న

కదలని ఓ శిలనే ఐన

తృటిలో కరిగే కలనే ఐన

ఎం తేడా ఉందట

నువెవ్వరంటూ అడిగితే నన్నెవరైనా

ఇలాగే కడదాకా

ఓ ప్రశ్నై ఉంటానంటున్న

ఏదో ఒక బదులై

నను చెరపొద్దని కాలాన్నడుగుతూ ఉన్న

నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దు

అనొద్దు దయుంచి ఎవరు

ఇంకొన్ని జన్మలకి సరిపడు

అనేక స్మృతుల్ని ఇతరులు ఎరుగరు

నా ఊపిరిని ఇన్నాళ్ళుగా

తన వెన్నంటి నడిపిన

చేయూత ఎవరిది

నా ఎద లయను కుసలం అడిగిన

గుస గుస కబురుల

గుమ గుమ లెవరివి

చరణం 1:

ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా

కాలం ఇపుడే నను కనగా

అనగనగ అంటూ నే ఉంటా

ఎపుడు పూర్తవనే అవక

తుది లేని కథ నేనుగా

గాలి వాటం లాగా ఆగే అలవాటే లేక

కాలు నిలవదు ఏ చోట నిలకడగా

ఏ చిరునామా లేక ఏ బదులు పొందని లేఖ

ఎందుకు వేస్తుందో కేక మౌనంగా

నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దు

అనొద్దు దయుంచి ఎవరు

ఇంకొన్ని జన్మలకి సరిపడు

అనేక స్మృతుల్ని ఇతరులు ఎరుగరు

నా ఊపిరిని ఇన్నాళ్ళుగా

తన వెన్నంటి నడిపిన

చేయూత ఎవరిది

నా ఎద లయను కుసలం అడిగిన

గుస గుస కబురుల

గుమ గుమ లెవరివి

చరణం 2:

లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం

నాకే సొంతం అంటున్నా విన్నారా

నేను నా నీడ ఇద్దరమే చాలంటున్న

రాకూడదు ఇంకెవరైనా

అమ్మ వొడిలో మొన్న

అందని ఆశలతో నిన్న

ఎంతో ఊరిస్తూ ఉంది

జాబిలీ అంత దూరాన ఉన్న

వెన్నెలగా చంతనే ఉన్న

అంటూ ఊయలలూపింది జోలాలి

తానే నానే నానినే

తానే నానే నానినే

తానే నానే నానినే

తానే నానే నానినే

తానే నానే నానినే

తానే నానే నానినే

తానే నానే నానినే

తానే నానే నానినే

Next Story

Most Viewed