మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి కి బిగ్ షాక్.. మద్యం కుంభకోణంలో నోటీసులు జారీ

by Mahesh |
మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి కి బిగ్ షాక్.. మద్యం కుంభకోణంలో నోటీసులు జారీ
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీ (Liquor Policy)లో జరిగిన అవకతవకలపై తాజాగా విచారణ కొనసాగుతోంది. పై టీడీపీ ఎంపీ ఏకంగా పార్లమెంట్ లో ప్రస్తావించడంతో ఈ కేసు సంచలనంగా మారింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కుంభకోణం (scandal)పై విచారించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)ను ఏర్పాటు చేసింది. కాగా ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న మాజీ వైసీపీ నేత విజయసాయి రెడ్డి (Vijayasai Reddy)కి తాజాగా సిట్ నోటీసులు జారీ చేసింది.

ఈ నెల 18న విజయవాడలోని సీపీ ఆఫీసు (Vijayawada CP Office)లో విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి అప్పుడు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. కాగా ఈ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు అయిన కసిరెడ్డి (Kasireddy) ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌(Hyderabad Jubililee Hills)తో పాటు పలు ప్రాంతాల్లో సుమారు 10 నుంచి 15 సిట్ బృందాలు తనిఖీలు చేశారు. ఈ కేసులో కసిరెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు.

2019-2024 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్యం విధానం (AP State Liquor Policy)లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. మద్యం లైసెన్స్‌ల కేటాయింపులో అవకతవకలు, నకిలీ మరియు నాసిరకం మద్యం ఉత్పత్తి, అమ్మకాలు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) ద్వారా బినామీ డిస్టిలరీల నుండి సబ్-స్టాండర్డ్ మద్యం కొనుగోలు చేశారు. దీంతో రూ. 20,000 కోట్లకు పైగా ఆర్థిక నష్టంతో పాటు రూ. 4,000 కోట్ల వరకు కిక్‌బ్యాక్‌లు (లంచాలు) సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నాసిరకం మద్యం వల్ల ఆరోగ్య సమస్యలు, ఆల్కహాల్ వ్యసనం వల్ల ఆత్మహత్యలు పెరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా సూచిస్తోంది.



Next Story

Most Viewed