- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
by Sumithra |

X
దిశ, బోథ్ : మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు జొన్నలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలని దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.
అనంతరం మార్క్ ఫెడ్ డీఎం ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ రైతుల తమ పంటను శుభ్రపరచి, ఆరబెట్టుకొని మార్కెట్ యార్డ్ కు తీసుకురావాలని, మద్దతు ధర రూ. 3371 కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కదం ప్రశాంత్, వ్యవసాయ అధికారి రవితేజ, మాజీ జెడ్పీటీసీ సంధ్యారాణి, సీఈఓ గోలి స్వామి, గొర్ల రాజు యాదవ్, పీఎసీఎస్ డైరెక్టర్లు, ఏఎంసీ సిబ్బంది, మండల నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
Next Story