Eatala Rajender: రేవంత్‌రెడ్డీ.. క్షమాపణ చెప్పు.. సీఎం‌పై ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్

by Prasad Jukanti |
Eatala Rajender: రేవంత్‌రెడ్డీ.. క్షమాపణ చెప్పు.. సీఎం‌పై ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలోని ప్రతి గడపలో సీఎంను దూషించే పరిస్థితి ఉందని, అతి తక్కువ సమయంలో ప్రభుత్వంపై ప్రజలు నిరసనలు తెలుపుతున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ ఆఫీస్‌పై దాడి ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన నాంపల్లిలోని స్టేట్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. అధిష్టానం మెప్పుకోసం రేవంత్‌రెడ్డి ఇలాంటి చిల్లర మల్లర పనులను ప్రోత్సహిస్తున్నారని, ప్రజలు అంతా గమనిస్తున్నారని తెలిపారు. బీజేపీ ఆఫీస్‌పై (Attack on BJP office) కాంగ్రెస్ శ్రేణులు దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని ఈటల మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవానికి ఇక్కడే ఉండి కూడా వర్చువల్‌గా హాజరైన సీఎం అదే ఆరాంఘర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి వెళ్లి ఇరువైపులా ఓవైసీ బ్రదర్స్‌ను (Owaisi Brothers) కోర్చోబెట్టుకుని వెకిలి మాటలు మాట్లాడారని ఫైర్ అయ్యారు. గతంలో బీఆర్ఎస్ నరేంద్రమోడీపై, బీజేపీపై మాట్లాడిందని, ఆ పార్టీ ఏమైపోయిందో అంతా చూశామన్నారు. కాంగ్రెస్ వెకిలి చేష్టలకు మూల్యం చెల్లించక తప్పదని సీఎం గుర్తుంచుకోవాలని ఈటల హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed