- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వారెవ్వా..ఇకపై ఎంత ప్రమాదం ఉన్నా ప్రాణాలతో బయటపడొచ్చు ?

దిశ, వెబ్ డెస్క్: సముద్రాలు ( Sea ), చిన్న చిన్న నీటి సరస్సుల దగ్గర పడవలు, పెద్ద షిప్పులు కనిపిస్తాయి. వాటితో పాటు ఆరెంజ్ కలర్ లో ( Orange colour) ఉండే లైఫ్ జాకెట్స్ ( Life Jackets) కూడా ఉంటాయి. మనం పడవల్లో ప్రయాణించినప్పుడు... కచ్చితంగా లైఫ్ జాకెట్స్ ధరిస్తాం. అయితే ఇదంతా పాత స్టైల్. ఇప్పుడు మార్కెట్లోకి సరికొత్త టెక్నాలజీ వచ్చేసింది. రోజులు మారినా కొద్దీ టెక్నాలజీ కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ తరుణంలోనే... జలాశయాల వద్ద కొట్టుకుపోయిన వారిని కాపాడేందుకు.... రిమోట్ కంట్రోల్ లైఫ్ గాడ్స్ ( Remote Control Life Guards )వచ్చేసాయి.
మనం రిమోట్ తో కంట్రోల్ చేసి.. జలాశయాలలో కొట్టుకుపోయిన వారిని కాపాడవచ్చు. ఓ జలాశయంలో... ప్రమాదవశాత్తు ఎవరైనా ఒక వ్యక్తి కొట్టుకుపోతే.. ఒడ్డు నుంచి వెంటనే ఈ రిమోట్ లైఫ్ గాడ్ ను నీటిలోకి వదలాలి. కొట్టుకుపోయిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడో ఆ డైరెక్షన్ లో రిమోట్.. ద్వారా కంట్రోల్ చేసి... అతని దగ్గరికి లైఫ్ గాడ్ పంపించాలి. చిన్న కారు రూపంలో ఉన్న ఈ ఆరెంజ్ కలర్ లైఫ్ గాడ్... గమ్యస్థానానికి వెళ్లి, కొట్టుకుపోతున్న వ్యక్తిని చేరుకుంటుంది. అనంతరం ఆ వ్యక్తి.. లైఫ్ గాట్ పట్టుకున్న తర్వాత... ఆ రిమోట్ ద్వారా కంట్రోల్ చేసి... సదర్ వ్యక్తిని ఒడ్డుకు చేర్చవచ్చు. ఈ ప్రాసెస్ ను సెకండ్లలో మనం సులభంగా చేయవచ్చు. ఇప్పుడు ఈ టెక్నాలజీ.. మార్కెట్లోకి వచ్చింది.
లైఫ్ గాడ్ ధర ఎంత అంటే ?
ఆరెంజ్ కలర్ లో ఉండే.. ఈ లైఫ్ గాడ్ ఆన్లైన్లో కూడా దొరుకుతుందని సమాచారం అందుతుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం దీని ధర 60 వేల రూపాయలు ఉంటుందట.
Remote controlled life saver👍
— Tansu Yegen (@TansuYegen) April 2, 2025
pic.twitter.com/7VtQgzBsHp