బ్యాంకాక్ గడ్డపై మోడీకి ఘన స్వాగతం.. గూస్ బంప్స్ రావాల్సిందే !

by Veldandi saikiran |
బ్యాంకాక్ గడ్డపై మోడీకి ఘన స్వాగతం.. గూస్ బంప్స్ రావాల్సిందే !
X

దిశ, వెబ్ డెస్క్: భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీకి ( PM Modi ) బ్యాంకాక్ లో (Bankok ) ఘన స్వాగతం లభించింది. బ్యాంకాక్ లో అడుగు పెట్టగానే... హిందుత్వం ఒట్టి పడేలా... ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికారు. ఇవాల్టి నుంచి థాయిలాండ్, శ్రీలంక దేశాలలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించబోతున్నారు. ఈ రెండు దేశాల్లో రెండు రోజుల పాటు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తారు. ఇందులో భాగంగానే... మొదట థాయిలాండ్ ( thailand) దేశానికి వెళ్లారు ప్రధాని నరేంద్ర మోడీ ( Prime Minister Narendra Modi).


దీంతో మొదటగా థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ ఎయిర్ పోర్టులో ( Bangkok Airport) దిగారు మోడీ. ఈ సందర్భంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. థాయిలాండ్ అధికారులతో పాటు మన ఇండియన్స్ కూడా.. మోడీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న భారతీయులు... మన జాతీయ జెండాలను పట్టుకొని.. దేశం గర్వించేలా చేశారు.


అనంతరం ఎయిర్ పోర్టు నుంచి ఈ నేరుగా కార్యక్రమానికి కూడా మోడీ వెళ్లారు. అక్కడ రామాయణం నాటకాన్ని కూడా ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా... థాయిలాండ్ లో ఆరవ BIMSTEC సమ్మిట్ జరుగుతోంది. ఇందులో ఇండియాతో పాటు థాయిలాండ్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, శ్రీలంక , భూటాన్ దేశాలు పాల్గొంటాయి. ఈ సదస్సుకు పైన పేర్కొన్న దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు హాజరవుతారు. ఇండియా తరపున మోడీ ( Prime Minister Narendra Modi) హాజరుకానున్నారు.


Next Story

Most Viewed