- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సూర్య ‘రెట్రో’ సినిమా థర్డ్ సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya)గత ఏడాది ‘కంగువ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ మూవీ అంతగా హిట్ సాధించలేకపోయింది. ప్రస్తుతం సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘రెట్రో’(Retro). కార్తీక్ సుబ్బరాజు(Karthik Subbaraju) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతుంది. అయితే ఇందులో పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే జయరామ్, ప్రకాష్ రాజ్(Prakash Raj) కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
ఈ చిత్రాన్ని 2డి బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘రెట్రో’ మే 1న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో మూవీ మేకర్స్ నిత్యం పలు అప్డేట్స్ విడుదల చేస్తూ సూర్య అభిమానులకు ట్రీట్ ఇస్తున్నారు. తాజాగా, ‘రెట్రో’ మూవీ అప్డేట్ రాబోతున్నట్లు డైరెక్టర్ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన మూడో పాట రేపు హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల కాబోతున్నట్లు ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ఇందులో సూర్య జనాల మధ్యలో ఉండగా.. చేతిని పైకెత్తి చూపిస్తాడు. కానీ దానికి తెలుపురంగు క్లాత్ కట్టి ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. అయితే ఈ పాటను స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడబోతుండగా.. సంతోష్ సంగీతం అందిస్తున్నారు.