సన్న బియ్యం పంపిణీ పేద కుటుంబాలకు వరం లాంటిది : చేవెళ్ల ఎమ్మెల్యే

by Aamani |
సన్న బియ్యం పంపిణీ పేద కుటుంబాలకు వరం లాంటిది :  చేవెళ్ల ఎమ్మెల్యే
X

దిశ,శంకర్ పల్లి : కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆహార భద్రత కార్డు కలిగిన పేద కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేయడం వరంలాంటిదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పేర్కొన్నారు. శంకర్ పల్లి లో గురువారం నిరుపేద కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబంలోని సభ్యులకి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున పంపిణీ చేయడం జరుగుతుందని, గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేయడం వలన లబ్ధిదారులు ఎవరు తినేవారు కాదని అది గ్రహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై భారం పడినప్పటికీ సన్న బియ్యం పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.

దీంతో పాటు పది సంవత్సరాలు రేషన్ కార్డులు పంపిణీ చేయక పేద కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడ్డాయని ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వారందరికీ కార్డులు అందుతాయని పేర్కొన్నారు. కార్డులు కలిగిన వారందరికీ అర కిలోల చొప్పున సన్న బియ్యం అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకర్ పల్లి తహసీల్దార్ సురేందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాశెట్టి చంద్రమోహన్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కుర్మా వెంకటేష్ యాదవ్, శంకర్పల్లి సొసైటీ డైరెక్టర్ కాడి గల రాజశేఖర్ రెడ్డి, శంకర్ పల్లి డిప్యూటీ తహసీల్దార్ బాలకృష్ణారెడ్డి, నాయకులు సా త ప్రవీణ్ కుమార్,చంద్రమౌళి, జూలకంటి రామ్ రెడ్డి జూలకంటి పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed