- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Shraddha Srinath: నా పాత్రలో ఎంతో డెప్త్ ఉంటుంది: శ్రద్ధా శ్రీనాథ్
దిశ, సినిమా: నందమూరి అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న లేటెస్ట్ చిత్రం ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj). నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా నటిస్తుండగా.. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి(Bobby Kolli) తెరకెక్కిస్తున్నారు. దీనిని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ(Suryadevara Nagavamsi), సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘డాకు మహారాజ్’ ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ క్రమంలో.. తాజాగా, శ్రద్ధా శ్రీనాథ్(Shraddha Srinath) మీడియాతో ముచ్చటించింది. ‘‘నేను ఇప్పటివరకు కొన్ని విభిన్న సినిమాలు చేశాను. అయితే ఈ చిత్రం మాత్రం ఒక పూర్తి ప్యాకేజ్‌లా ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్ నేను ఇప్పటి వరకు చేయలేదు. కామెడీ(Comedy), యాక్షన్, ఎమోషన్ అన్నీ ఉంటాయి.
పైగా బాలకృష్ణ(Balakrishna) గారి సినిమా అంటే ఎక్కువ మంది ప్రేక్షకులకు నా ప్రతిభను చూపించే అవకాశం ఉంటుంది. నా పాత్ర పేరు నందిని. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ఎంతో ఓపిక ఉంటుంది. అదే సమయంలో ఎప్పుడు మాట్లాడాలో స్పష్టంగా తెలుసు. నా పాత్రలో ఎంతో డెప్త్ ఉంటుంది. నటనకు కూడా ఎంతో ఆస్కారముంది. ఈ సినిమాపైనా, ఇందులో నేను పోషించిన నందిని(Nandini) పాత్ర పైనా ఎంతో నమ్మకంగా ఉన్నాను. నందిని పాత్రతో ప్రేక్షకులకు మరింత చేరువ కానున్నాను. ఈ సినిమా నుంచి ఎంతో నేర్చుకున్నాను’’ అని చెప్పుకొచ్చింది.
Read More ...
Srimukhi : యాంకర్ శ్రీముఖి బహిరంగ క్షమాపణలు