India Post: పాన్ అప్‌డేట్ పేరుతో స్కామ్.. పోస్ట్ పేమెంట్ బ్యాంక్ కస్టమర్లకు ప్రభుత్వం అలర్ట్

by S Gopi |
India Post: పాన్ అప్‌డేట్ పేరుతో స్కామ్.. పోస్ట్ పేమెంట్ బ్యాంక్ కస్టమర్లకు ప్రభుత్వం అలర్ట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్(ఐపీపీబీ) కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. గత కొంతకాలంగా సైబర్ నేరగాళ్లు వివిధ పద్దతుల్లో సామాన్యులను మోసం చేస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా ఇటీవల ఐపీపీబీ కస్టమర్లకు పాన్ కార్డు వివరాలను అప్‌డేట్ చేయడంలో విఫలమైనందున తమ అకౌంట్ బ్లాక్ అవుతుందని మెసేజ్‌లు పంపిస్తున్నారు. అయితే, ఇలాంటి నకిలీ మెసేజ్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఆయా నకిలీ మెసేజ్‌లలో వినియోగదారులు తమ పాన్ కార్డు సమాచారాన్ని అప్‌డేట్ చేయాలంటూ లింక్‌ని కూడా పంపిస్తున్నారు. దాన్ని గనక క్లిక్ చేస్తే సదరు అకౌంట్ వాడుతున్న వ్యక్తి డబ్బుతో పాటు వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ స్కామర్లు దొంగలిస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఇలాంటి పాన్ వివరాల అప్‌డేట్ అంటూ ఇండియా పోస్ట్ ఎప్పుడూ, ఎలాంటి మెసేజ్‌లను పంపలేదని స్పష్టం చేసింది. ఇటువంటి మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరికీ వ్యక్తిగత సమాచారం, ప్రభుత్వ డాక్యుమెంట్ల వివరాలను ఇవ్వకూడదని హెచ్చరించింది. దీనికి సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో కూడా ఇండియా పోస్ట్ ట్వీట్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed