‘నీవు మగాడివైతే ముందు ఆ పని చేయు’.. సీఎం రేవంత్‌పై రెచ్చిపోయిన కేటీఆర్

by Gantepaka Srikanth |
‘నీవు మగాడివైతే ముందు ఆ పని చేయు’.. సీఎం రేవంత్‌పై రెచ్చిపోయిన కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-కార్ రేసు(Formula-E Case) కేసుపై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని నందినగర్ నివాసం వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తనపై పెట్టింది అక్రమ కేసు అని ఆరోపించారు. ఇది రాజకీయ ప్రేరేపిత లొట్టపీసు కేసు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం అడ్డం పెట్టుకుని నాపై అక్రమ కేసు పెట్టారని అన్నారు. ఈ కేసులో అసలు పసలేదని తెలిపారు. అవినీతి పరులకు అంతా అవినీతే కనిపిస్తుందని తెలిపారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కొంతమంది లాయర్లే మంత్రులు అవుతున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

విచారణ ఎప్పుడైనా న్యాయవాదుల సమక్షంలోనే జరగాలని అన్నారు. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తానని కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర హైకోర్టు(Telangana High Court) క్వాష్ పిటిషన్ మాత్రమే కొట్టిపారేసిందని తెలిపారు. తాను అణాపైసా అవినీతి కూడా చేయలేదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నోటి వెంట వచ్చేవి నీతులు కాదని విమర్శించారు. విధ్వంసం, మోసం, డైవర్షన్.. ఈ మూడే రేవంత్ రెడ్డికి తెలిసిన పనులు అని ఎద్దేవా చేశారు.

‘నీవు మగాడివైతే జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో చర్చ పెట్టు. నేను వస్తా. చట్టాన్ని గౌరవించాలని ఉద్దేశంతోనే లాయర్లతో విచారణకు వెళ్లాను. మీలాగా దివాలా కోరు పని చేసే కర్మ మాకు లేదు. హైకోర్టు అనుమతిస్తే లాయర్లతో కలిసి విచారణకు తప్పకుండా వెళ్తా. ఈనెల 16న ఈడీ విచారణకు కూడా హాజరవుతా.. నామీద కేసు పెట్టి శునకానందం పొందుతున్నారు. రాజ్యాంగపరంగా ప్రతి హక్కును వినియోగించుకుంటా.. న్యాయ వ్యవస్థపై నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నాకు ఉరిశిక్ష పడినట్లుగా కాంగ్రెస్ వాళ్లు సంబురపడుతున్నారు. సుప్రీంకోర్టులో న్యాయపరంగా పోరాడుతాను’ అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed