Bellamkonda Sai Srinivas: ‘BSS12’ నుంచి డబుల్ ధమాకా.. పోస్టర్‌తో హైప్ పెంచిన మేకర్స్

by Hamsa |
Bellamkonda Sai Srinivas: ‘BSS12’ నుంచి డబుల్ ధమాకా.. పోస్టర్‌తో హైప్ పెంచిన మేకర్స్
X

దిశ, సినిమా: ఏడాది పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రకటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. మహేష్ చందు(Mahesh Chandu) దర్శకత్వంలో ఆయన ‘BSS12’ అనే మూవీ చేస్తున్నాడు. దీనిని మూన్ షైన్ పిక్చర్స్(Moonshine Pictures) బ్యానర్‌పై లుదీర్ బైరెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్(First look poster), టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ విడుదల చేసి మేకర్స్ డబుల్ ధమాకా ఇచ్చారు.

BSS12 చిత్రానికి ‘హైందవ’(Haindava) అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుపుతూ దేవుడి గుడి ముందు విగ్రహాలతో కలిసి ఆగ్రహంతో ఉన్న సాయి శ్రీనివాస్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ఈ గ్లింప్స్ చూసినట్లైయితే.. ఇందులో కొంతమంది దుండగులు ఓ గుడిని తగలబెడదాం అనుకుంటే శ్రీనివాస్, ఓ వరాహం, ఓ సింహం వచ్చి కాపాడినట్టు చూపించారు. అలాగే బ్యాక్ గ్రౌండ్ లో విష్ణుమూర్తి(Vishnumurthy) దశావతారాలు చూపించారు. ఈ గ్లింప్స్‌నే షేర్ చేస్తూ ‘‘దైవత్వంలో పాతుకుపోయిన, సాహసానికి ఆజ్యం పోసిన కథ. ధైర్యం, విశ్వాసం, కాలాన్ని మించిన సాహసం’’ అనే క్యాప్షన్ పెట్టారు. అయితే ఈ సినిమా మైథలాజికల్ థ్రిల్లర్‌గా(Mythological thriller) రాబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed