HYDRA : బుద్ధ భవన్లో హైడ్రా పోలీస్ స్టేషన్

by M.Rajitha |   ( Updated:2025-01-07 14:58:15.0  )
HYDRA : బుద్ధ భవన్లో హైడ్రా పోలీస్ స్టేషన్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) హైడ్రా(Hydra)కు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని బుద్ధ భవన్(Buddha Bhavan) లోని బీ బ్లాక్ లో హైడ్రా పోలీస్ స్టేషన్(HYDRA PS) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వం ఇప్పటికే హైడ్రాకు విస్తృత అధికారులు కల్పిస్తూ ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నగరంలో జలాశయాలు, ఇతర ఆస్తులను కాపాడేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని భావించి, హైడ్రాను ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ చట్టం(GHMC Act) 1955ను సవరించి, కొత్తగా 374 బీ సెక్షన్ ను చేర్చింది. తాజాగా హైడ్రాకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసింది. పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా ఏసీపీ స్థాయి అధికారిని, హైడ్రా పిఎస్ కు కావాల్సిన సిబ్బందిని కేటాయించాలని డిజిపికి ఉత్తర్వులు విడుదల చేసింది.

Advertisement

Next Story

Most Viewed