Formula E car race Case: అది నేరమే... అరెస్ట్ చేయొచ్చు...!

by srinivas |
Formula E car race Case: అది నేరమే... అరెస్ట్ చేయొచ్చు...!
X

దిశ, వెబ్ డెస్క్: ఫార్ములా ఈ కార్ రేసు(Formula E car race) ఫిట్ కేసు అని ఏసీబీ మాజీ చీఫ్ పూర్ణచందర్‌రావు(Former ACB chief Purnachander Rao) తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్(Former Minister Ktr) పై కేసు నేపథ్యంలో ఆయన స్పందించారు. నిధుల గోల్‌మాల్ విషయం దర్యాప్తులో తేలుతుందని తెలిపారు. డబ్బులు ఇచ్చినట్లు కేటీఆరే చెబుతున్నారని.. అదే విషయాన్ని విచారణలో ఏసీబీ అధికారులకు చెప్పుకోవచ్చన్నారు. విచారణ సమయంలో కేటీఆర్ వెంట లాయర్ అవసరం లేదన్నారు. విచారణకు కేటీఆర్ హాజరైతే తప్పేంటని పూర్ణ చందర్ రావు ప్రశ్నించారు....


‘‘డబ్బులు పోవడమే కాదు. ఇవ్వడానికి ప్రయత్నించినా నేరమే. ప్రభుత్వానికి నష్టం కలిగిస్తే అది క్రిమినల్ కేసు అవుతుంది. కేసులో కేటీఆర్ క్రియాశీలకమని ఏసీబీ చెబుతోంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చూశాకే ఏసీబీ కేసు ఫైల్ చేస్తుంది. నోట్ ఫైల్స్‌లో ఆధారాలు ఉండి ఉండొచ్చు. ఆధారాలు లేకుండా ఏమీ చేయడానికి ఉండదు. డబ్బులు ఇచ్చినట్లు కేటీఆరే చెబుతున్నారు. అదే విచారణలో చెప్పొచ్చు. ఏసీబీ అధికారులు చాలా వెరిఫై చేసుకునే ఉంటారు. ఆలస్యమయ్యే కొద్ది ఇంకా చాలా ఆధారాలు సేకరించే అవకాశాలు ఉంటాయి. విచారణలో పొంతన లేని సమాధానాలు చెబితే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు.’’ అని పూర్ణ చందర్‌రావు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed