- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విషం కలిపి చంపడానికి ప్రయత్నించారు.. బీజేపీ నేత బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు!
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు సినీ ప్రేక్షకులకు బాబు మోహాన్ గురించి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన పని లేదు. తన నటనతో, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు కమెడియన్ బాబు మోహన్. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల్లో తన సేవలను అందిస్తున్నారు. ఇకపోతే తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆయన వ్యక్తగత విషయాలో ఓ షాకింగ్ సంఘటన తెలిపారు. బాబు మోహన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "ఢిల్లీలో శ్రీకాంత్ 'వన్స్‌మోర్' సినిమా షూటింగ్ చేస్తున్నాం. ఆ సమయంలో సెట్స్‌లో తనికెళ్ల భరణి పాన్ తింటున్నాడు. నన్ను కూడా తినమని నాకు కూడా పాన్ అలవాటు చేశాడు.
ఆ తర్వాత ఒకానొక టైంలో రోజుకు 30 నుంచి 40 దాకా పాన్లు తిన్నాను. సంగారెడ్డిలో ఓ పాన్ డబ్బాలో పాన్ బాగుంటుంది. దీంతో సంగారెడ్డికి వెళ్లిన ప్రతిసారి అక్కడి నుంచి పాన్ తెప్పించుకొని తినేవాడిని. 'రాజకీయాల్లో విరోధులు ఉంటారని తెలిసిందే. నేను అక్కడ పాన్ కచ్చితంగా తింటానని తెలిసిన కొందరు ఓసారి పాన్ లో విషాన్ని కలిపారు. నేను ఆ డబ్బా దగ్గరకు వెళ్లి పాన్ తీసుకుని కారులో వెళ్ళేటప్పుడు తిందామనుకునే సమయానికి ఎవరో ఫోన్ చేసి దయచేసి పాన్ తినకండి, అందులో విషం ఉందని చెప్పారు'. నేను వెంటనే పాన్ పక్కన పడేశాను. ఆ తర్వాత ఆ పాన్ కట్టే వ్యక్తి భార్య కాల్ చేసి.. తప్పయిపోయింది సార్, విషం కలిపిన పాన్ ఇవ్వమని మమ్మల్ని ఒత్తిడి చేశారు, లేకపోతే చంపేస్తాం అన్నారు అని ఏడ్చింది. రాజకీయాలు ఇంత ప్రమాదమా అని అప్పుడు తెలిసింది. ఇలాంటివి సినిమాల్లోనే అనుకున్నా నిజ జీవితంలో కూడా జరుగుతాయా అని తెలిసింది'' అంటూ తన లైఫ్ లో జరిగిన ఈ చేదు సంఘటనని తెలిపారు.