- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బహుజన రాజ్యస్థాపనే లక్ష్యంగా నడుం బిగించాలి : ఆర్ఎస్పీ
దిశ, నూతనకల్ : అగ్రకుల రాజ్యాధికారాన్ని బహుజనులు ఇంకెన్నాళ్లు భరించాలని, బహుజన రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కన్వీనర్ డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
వెంకేపల్లిలో బండి యాదగిరి స్తూపం సందర్శన ఆయన.. బండి యాదగిరి పుట్టినిల్లు అయిన వెంకేపల్లి గ్రామాన్ని సందర్శించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజల ఆస్తులు కాపాడటానికి నియంత పాలనను తరిమి కొట్టడానికి ప్రజలు సమాయత్తం కావాలని, బండి వెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి.. పాటను గుర్తు చేసుకుంటూ, తొందరలోనే కేసీఆర్ పాలనకు గోరి కడతాం అని ఆర్ఎస్పీ హెచ్చరించారు.
ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా ఆదివారం నూతనకల్ మండల కేంద్రానికి చేరుకుంది. ఈ యాత్ర వెంకేపల్లి, చిల్పకుంట్ల, నూతనకల్, యడవెల్లి, తాళ్ల సింగారం వరకు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ అగ్రకులాల చేతిలో పోయిందని, తద్వారా బహుజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్రంలో బహుజనుల అభివృద్ధికి కేసీఆర్ ఏం చేసింది లేదని అన్నారు. తెలంగాణలో పూర్తిగా గడీల పాలన జరుగుతూ ఇష్టరాజ్యంగా నిధులు ఖర్చు చేస్తూ సామాన్య ప్రజలకు భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ యాత్రలో తుంగతుర్తి బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి బల్గురి స్నేహ, నియోజకవర్గ రాజ్యాధికార యాత్ర ఇన్ చార్జి దాసరి శ్రీను, నూతనకల్ మండల కోఆర్డినేటర్ గోగిల రాజు, చిల్పకుంట్ల గ్రామ కో ఆర్డినేటర్ బొజ్జ నవీన్, సందీప్, రవి, బత్తుల మధు, వివిధ గ్రామాల కోఆర్డినేటర్లు, కన్వీనర్లు పాల్గొన్నారు.