Teja Sajja : శ్రీలంకలో షెడ్యూల్ పూర్తి.. చేతికి గాయంతో కనిపించిన తేజ సజ్జా..?

by Anjali |   ( Updated:2024-10-21 10:39:42.0  )
Teja Sajja : శ్రీలంకలో షెడ్యూల్ పూర్తి.. చేతికి గాయంతో కనిపించిన తేజ సజ్జా..?
X

దిశ, వెబ్‌డెస్క్: హనుమాన్ బ్లాక్ బస్టర్ హీరో తేజ సజ్జా మిరాయ్ సినిమా కోసం పెద్ద సాహసమే చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్, పోస్టర్లు ప్రేక్షకుల్లో భారీ హైప్ పెంచాయి. ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. దీంతో మిరాయ్ పై జనాల్లో మరింత క్యూరియాసిటీ పెరుగుతోంది. రీసెంట్ గానే ఈ మూవీ షూటింగ్ శ్రీలంకలో కంప్లీట్ చేసుకుంది. అక్క భారీ యాక్షన్ సీక్వెల్స్ లను షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఓ ట్రైన యాక్షన్ సన్నివేశంలో హీరో డూప్ లేకుండా నటించాడట. దీనికి సంబంధించి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో తేజ సజ్జా చేతికి గాయం అయినట్లు కనిపిస్తుంది. చేతకి వైట్ బ్యాండెజ్ తో కట్టుకుని ఉన్నాడు. శ్రీలంకలో చిత్రీకరణ కంప్లీట్ చేసుకుని హైదరబాదు వచ్చే క్రమంలో.. ఎయిర్ పోర్ట్ లో తేజ చేతికి కట్టు కనిపించింది. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. డూ్ లేకుండా రియల్ గా సీక్వెన్స్ చేస్తున్నాడంటూ తేజపై జనాలు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి మిరాయ్ కోసం కుర్ర హీరో భారీగానే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed