ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి

by Mahesh |
ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి
X

దిశ, చిట్యాల: ఉద్దీపన ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు శిక్షణ పొందాలనుకునే నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్దీపన ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నందున ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ జేఏసీ కో కన్వీనర్ దేశపాక రాజేష్ ఒక ప్రకటన లో కోరారు. నకరికల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉద్దీపన ఫౌండేషన్ సొసైటీ కింద అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగానే నకిరేకల్ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని అందివ్వనున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed