- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Karnataka: డిసెంబర్ 27న 'జై బాపు, జై భీమ్, జై సంవిధాన్' ర్యాలీ: కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్
దిశ, నేషనల్ బ్యూరో: బీఆర్ అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాజ్యసభలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఈ అంశంపై నిరసన గళం విప్పుతోంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 27న 'జై బాపు, జై భీమ్, జై సంవిధాన్' ర్యాలీ నిర్వహించనున్నట్లు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బుధవారం ప్రకటించారు. భారతదేశ స్వాతంత్ర్య చరిత్ర, మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వంటి దిగ్గజాల గురించి, వారు చేసిన పనులపై కాషాయ పార్టీకి అవగాహన లేదని బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారికి (బీజేపీ) స్వాతంత్య్ర చరిత్ర తెలియదు.. మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాముఖ్యత తెలియదు. కాంగ్రెస్ చరిత్రే దేశ చరిత్ర. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో సమాజంలోని అన్ని వర్గాలకు మేలు జరిగిందని, దేశాన్ని సమైక్యంగా ఉంచిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. కాగా, అంబేడ్కర్ గురించి అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసనలను కొనసాగిస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే అంబేడ్కర్ ఆశయాల పట్ల నిబద్ధతను చూపేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని ప్రధాన ఎజెండాగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది.