- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికా విజయం.. వరల్డ్ కప్ నుంచి భారత్ ఔట్
దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్ వేదికగా జరుగుతోన్న మహిళల వరల్డ్ కప్ నుంచి టీమిండియా వైదొలిగింది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓటమి చెందడంతో సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు వైఫల్యం చెందారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 277/7 స్కోర్ చేశారు. స్మృతి మంధాన (71), షెఫాలీ వర్మ (53), మిథాలీ రాజ్ (68), హర్మన్‌ప్రీత్ కౌర్ (48) రాణించారు. అనంతరం భారత్ నిర్దేశించిన 278 పరుగుల టార్గెట్‌ను ఆఖరి బంతికి దక్షిణాఫ్రికా ఛేదించింది. చివరి ఓవర్‌లో ఏడు పరుగులు అవసరం కాగా, మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరకు దీప్తి శర్మ నోబాల్ వేయడంతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా రెండో స్థానంలో నిలిచి సెమీస్‌కు చేరింది. భారత మహిళల జట్టు ఇంటిదారి పట్టనుంది.