- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
YSRCP: శాసన మండలిలో రగడ.. వాకౌట్ చేసిన వైసీపీ నేతలు
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రాష్ట్రంలో వైద్య కళాశాలల నిర్మాణంపై ముందుగా దుమారం రేగగా.. అదే విషయంపై టీడీపీ మంత్రి సత్యకుమార్ ప్రతిపక్షంపై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో ఆయన తీరును నిరసిస్తూ వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. కాగా.. ఈ రోజు (శుక్రవారం) జరిగిన శాసన మండలి సమావేశాల్లో రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై చర్చ మొదలుకాగా.. ముందుగా మాట్లాడిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satyakumar Yadav).. మెడికల్ కళాశాల నిర్మాణం విషయంలో గత సీఎం జగన్ పక్షపాతంతో వ్యవహరించారని, పులివెందుల కాలేజీకి తప్ప, మిగతా ఏ కాలేజీ నిర్మాణానికీ సరిపడా నిధులివ్వలేదని తీవ్ర ఆరోపణలు చేశారు.
కనీసం అధ్యాపకులకు మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వల్లే ఈ ఏడాది మెడికల్ కాలేజీల నిర్వహణకు జాతీయ వైద్య మండలి అనుమతి ఇవ్వలేదని విమర్శించారు. దీనంతటికీ కారణమైన జగన్.. మళ్లీ కూటమి ప్రభుత్వాన్ని నిందించడం ఏంటని సత్యకుమార్ మండిపడ్డారు. జగన్ హయాంలో పులివెందుల కళాశాల నిర్మాణానికి రూ.500 కోట్లకు గానూ రూ.290 కోట్లు ఖర్చు చేసిన వైసీపీ సర్కార్.. అదే టైంలో మార్కాపురం కాలేజ్ కోసం రూ.475 కోట్లకు గానూ కేవలం రూ.47 కోట్లు మాత్రమే ఎందుకు ఖర్చు చేసిందని ప్రశ్నించారు. పులివెందుల కళాశాలపై ఉన్న శ్రద్ధ రాయలసీమలోని ఇతర కాలేజీలపై ఎందుకు చూపించలేదో సభలో ఉన్న వైసీపీ సభ్యులు చెప్పాలని నిలదీశారు. ఏడాదిలో తాడేపల్లి ప్యాలెస్ నిర్మించుకున్న జగన్.. వైద్యకళాశాలలు పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే మంత్రి సత్యకుమార్ తీరును నిరసిస్తూ శాసన మండలి నుంచి వైసీపీ ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు.