Jayam Ravi: జయంరవికి షాకిచ్చిన కోర్టు..

by Rani Yarlagadda |   ( Updated:2024-11-15 16:09:28.0  )
Jayam Ravi: జయంరవికి షాకిచ్చిన కోర్టు..
X

దిశ, వెబ్ డెస్క్: నటుడు జయం రవికి చెన్నై ఫ్యామిలీ కోర్టు (Chennai Family Court) షాకిచ్చింది. జయంరవి - ఆర్తి దంపతుల విడాకుల పిటిషన్ ను పరిశీలించిన కోర్టు.. ఇరు వర్గాల వాదనలను విన్న తర్వాత.. మరోసారి రాజీకి ప్రయత్నించాలని సూచించింది. లేదు.. తాము విడిపోవడానికే సిద్ధమైతే అందుకు సరైన కారణాన్ని చెప్పాలని తెలిపింది. జయం రవి (Jayam Ravi) ఈ ఏడాది సెప్టెంబర్ లో తాము విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తన భార్య ఆర్తి, తను కలిసి ఎంతో ఆలోచించి, ఎన్నో చర్చించాకే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు.

అయితే.. జయం రవి ప్రకటనపై ఆర్తి అసహనం వ్యక్తం చేశారు. తనను సంప్రదించకుండా, తన అనుమతి లేకుండానే విడాకుల గురించి బహిరంగ ప్రకటన చేశారని వాపోయారు. దీంతో జయం రవి దంపతుల విడాకుల వ్యవహారం చర్చకు దారి తీసింది. అయితే.. తన భార్య ఆరోపణలపై ఆయన గతంలో మీడియాతో మాట్లాడుతూ.. ఆమెకు లాయర్ ద్వారా విడాకుల నోటీస్ పంపానని, తన తండ్రికి కూడా ఈ విషయం తెలుసన్నారు. ఇరుకుటుంబాల పెద్దలు ఈ వ్యవహారం చర్చించుకున్నాకే తాను ప్రకటన చేశానని, అలాంటప్పుడు వారికి తెలియకుండా విడాకులు ప్రకటించానని ఎలా అంటారని ప్రశ్నించారు.


Read More..

Chaitu Jonnalagadda: ఫేక్ హీరో కంటే రియల్ విలన్ బెటర్.. క్యూరియాసిటీ పెంచేస్తున్న జొన్నలగడ్డ


Advertisement

Next Story