- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Department of Education:స్కూళ్లకు ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు
by Jakkula Mamatha |
X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు(Govt School) ఏపీ విద్యాశాఖ(Department of Education) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ స్కూళ్ల ఆవరణల్లో వివాహాలు, రాజకీయ, మతపరమైన సమావేశాలను నిషేధిస్తూ తాజాగా విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. ఈ క్రమంలో పాఠశాలల(School) పనివేళలకు ముందు, తర్వాత, సెలవుల్లో ఇలాంటి కార్యక్రమాలకు ఆర్జేడీలు, డీఈవోలు, హెచ్‌ఎమ్ లు అనుమతిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని విద్యాశాఖ తెలిపింది. అయితే ఎంతో పవిత్రమైన విద్యాలయాల్లో ఇటువంటి కార్యక్రమాలకు అనుమతించడం పై విద్యాశాఖ సీరియస్ అయినట్లు సమాచారం. దీంతో ఇటువంటి ఘటనలపై విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎట్టిపరిస్థితుల్లోనూ అలాంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వొద్దని ఏపీ విద్యాశాఖ(Department of Education) స్పష్టం చేసింది.
Advertisement
Next Story