- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
సోమశిలకు పోటెత్తిన భక్తులు
దిశ,కొల్లాపూర్: కార్తీక పౌర్ణమి శుక్రవారం సందర్భంగా కొల్లాపూర్ మండలం సోమశిల ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. సోమశిలకు కార్తీక శోభ సంతరించుకున్నది. శ్రీ లలితాంబిక సోమేశ్వర స్వామి క్షేత్రం ఆవరణ భక్తులతో కిటకిటలాడాయి. భక్తుల కోసం ఆర్టీసీ అధికారులు కొల్లాపూర్ నుంచి సోమశిల కు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సోమశిల వద్ద సప్తనదుల సంగమ ప్రదేశం కృష్ణానదిలో పుణ్య స్నానాలు చేసి, గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. నదిలో కార్తీక దీపాలను వదిలారు. అనంతరం ఆలయ ఆవరణలో ఉన్న తులసి చెట్టు వద్ద పూజలు చేసి..కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయంలో స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి సోమశిలకు వచ్చే భక్తులు,పర్యాటకులు తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు..జనరల్ ఘాట్ వద్ద జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నర్సింహ పర్యవేక్షణలో పార్కింగ్ చదును చేసే పనులు జరుగుతున్నాయి.