వ్యక్తి ఆత్మహత్య..బావిలో దొరికిన మృతదేహం!

by Naveena |
వ్యక్తి ఆత్మహత్య..బావిలో దొరికిన మృతదేహం!
X

దిశ,రాజాపేట : జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం రాజపేటలో వెలుగులోకి వచ్చింది. ఎస్సై నాగుల ఉపేందర్ తెలిపిన వివరాలు ప్రకారం..రాజాపేట మండల కేంద్రంలోని కొత్త కాలనికి చెందిన మేకల వెంకటేష్(30) మంగళవారం రాత్రి నుంచి కనిపించడం లేదని, శుక్రవారం ఉదయం దాచేపల్లి రాజు వ్యవసాయ బావిలో శవమై కనిపించినట్లు తెలిపారు. కార్ డ్రైవింగ్ చేసుకుంటూ రాజపేట గ్రామంలో నివసిస్తున్న వెంకటేష్ కు అతని భార్య పవిత్రకు గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం రోజున వెంకటేష్ అత్తమామలు వచ్చి..అతనికి సర్ది చెప్పి వెంకటేష్ భార్య,పిల్లల్ని హైదరాబాదుకు తీసుకొని వెళ్ళారు. వారు వెళ్ళిన రోజు నుంచి వెంకటేష్ ప్రతిరోజు మద్యం తాగుతూ మద్యానికి బానిసై వాళ్ళ తల్లిదండ్రులతో బాధపడుతూ నేను చనిపోతాను అని మాట్లాడుతుండేవాడు. వెంకటేష్ గత మంగళవారం రోజున రాత్రి ఫుల్లుగా మద్యం తాగి, ఇంటికి వచ్చి ఇంట్లో పడుకున్నాడు. తెల్లవారాక లేచి చూసేసరికి వెంకటేష్ ఇంట్లో కనిపించలేదు. అతని తండ్రి మేకల సత్తయ్య రాజాపేటలోని బంధువుల ఇండ్లలో మొత్తం వెతికిన కనిపించలేదు. శుక్రవారం ఉదయం 8:30 ప్రాంతంలో రాజంపేట గ్రామ శివారులో దాచేపల్లి రాజు వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం అందింది. దీంతో అతని తండ్రి వెళ్లి చూసేసరికి బావిలో నీటిలో మునిగి చనిపోయి ఉన్నాడు. గత కొంతకాలంగా భార్యాపిల్లల గురించి బాధపడుతూ..జీవితం మీద విరక్తి చెంది తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదు చేశాడు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నామని ఎస్ఐ తెలిపారు.

శభాష్ ఎస్ఐ నాగుల ఉపేందర్ యాదవ్

మేకల వెంకటేష్ శవాన్ని శుక్రవారం స్థానికుల సహాయంతో బయటకు తీసే ప్రయత్నంలో అక్కడికి వచ్చినవారు వెనుకడు వేశారు. దీంతో స్వయంగా ఎస్సై నాగుల ఉపేందర్ యాదవ్ వ్యవసాయ బావిలోకి దిగి శవాన్ని బయటికి తీస్తానని చెప్పడంతో..కొందరు వ్యక్తులు ముందుకొచ్చి బావిలో నుంచి శవాన్ని బయటకు తీశారు. శవం ఉబ్బిపోవడం, కొన్నిచోట్ల పురుగులు కొరకడంతో దుర్వాసన వస్తుంది. దీంతో గ్రామస్తులు శవం దగ్గరికి వచ్చేందుకు జంకు తిన్నారు. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన ఎస్సై నాగల ఉపేందర్ యాదవ్ శవాన్ని మోసి..పోస్టుమార్టం నిమిత్తం వాహనంలోకి తరలించారు. ఆ సమయంలో అక్కడున్న ప్రజలందరూ, ఫోటోలు సోషల్ మీడియాలో చూసినవారు ఎస్సై నాగల ఉపేందర్ యాదవ్ ధైర్య సాహసాలు, వృత్తి పట్ల నిబద్ధత, సేవా కార్యక్రమం, మానవత్వం చూపడం పట్ల సంతోషం వ్యక్తం చేసి అభినందిస్తూ " శభాష్ ఎస్ఐ ఉపేందర్ యాదవ్ గారు" అంటూ ప్రశంసించారు. మీ సేవలు ఆదర్శంగా ఉన్నాయంటూ పలువురు పొగిడారు.


Advertisement

Next Story