- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Johny Master : బెయిల్ మీద బయటికి వచ్చిన జానీ మాస్టర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్ : లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Johny Master).. ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసిందే. 37 రోజులు జైలు జీవితం గడిపిన మాస్టర్‌కు రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేయగా.. బయటకు వచ్చిన జానీ మాస్టర్ ప్రస్తుతం తన టైం అంతా ఫ్యామిలీకే కేటాయిస్తున్నాడు. ఈ క్రమంలోనే మాస్టర్ తాజాగా టూర్‌కి వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని జానీ ఎక్స్(X) వేదికగా పోస్ట్ చేశాడు. తన భార్య, పిల్లలతో కలిసి బీచ్ దగ్గర దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తనను లైంగికంగా వేధించడాని ఓ మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన నార్సింగి పోలీసులు జానీపై ఐపీసీ 376, 506, 323 సెక్షన్‌లతో పాటు పోక్సో(Pocso) చట్టం కింద కేసు నమోదు చేశారు. గోవాలో జానీని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రోడ్యూస్ చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం జాతీయ అవార్డుల నేపథ్యంలో అక్టోబర్ 6 నుంచి 9వ తేదీ వరకు బెయిల్ కావాలని రంగారెడ్డి జిల్లా కోర్టును కోరగా.. కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. అయితే జాతీయ అవార్డుల కమిటీ అవార్డును క్యాన్సిల్ చేసింది. ఫలితంగా మళ్లీ జైలుకు వెళ్ళిన మాస్టర్.. రెగ్యులర్ బెయిల్ కోసం పోక్సో కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ అనంతరం అతడికి బెయిల్‌ను మంజూరు చేసింది. ప్రస్తుతం బెయిల్ మీద బయటికి వచ్చిన జానీ.. ఫ్యామిలితో వెకేషన్ కి వెళ్ళి చిల్ అవుతున్నాడు.
Read More..
Alekhya Reddy: షాకింగ్ లుక్‌తో దర్శనమిచ్చిన తారకరత్న భార్య.. పోస్ట్ వైరల్
- Tags
- Johny Master