Anshul kamboj : ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన అన్షుల్ కంబోజ్.. రంజీల్లో రేర్ ఫీట్

by Sathputhe Rajesh |
Anshul kamboj : ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన అన్షుల్ కంబోజ్.. రంజీల్లో రేర్ ఫీట్
X

దిశ, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా హర్యానా ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కంబోజ్ రికార్డు సృష్టించాడు. 39 ఏళ్లలో తొలిసారి ఈ ఫీట్ సాధించిన ఆటగాడిగా కంబోజ్ చరిత్ర సృష్టించాడు. శుక్రవారం హర్యానా, కేరళల మధ్య చౌదరి బన్సిలాల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు. 23 ఏళ్ల ఈ యువ ఫాస్ట్ బౌలర్ అద్భుతమైన స్పెల్ వేసి కేరళను 291 పరుగులకు కట్టడి చేశాడు. 30.1 ఓవర్లు వేసిన అన్షుల్ 9 మెడిన్ ఓవర్లు వేసి 49 పరుగులు ఇచ్చి 10 వికెట్లు పడగొట్టాడు.

రంజీల్లో ఇప్పటి వరకు 10 వికెట్లు తీసిన బౌలర్లు వీరే..!

రంజీల్లో 1956లో బెంగాల్ జట్టు తరఫున ఆడిన ప్రేమాంగ్స్ ఛటర్జీ అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగులు మాత్రమే ఇచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. 1985లో రాజస్థాన్ బౌలర్ ప్రదీప్ సుందరం విదర్భతో జరిగిన మ్యాచ్‌లో 78 పరుగులు ఇచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. తాజాగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అన్షుల్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఈ ఫీట్ సాధించిన ఆరో బౌలర్‌గా అన్షుల్ నిలిచాడు. అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌లో అనిల్ కుంబ్లే 1999లో ఈ ఫీట్ సాధించాడు.

Advertisement

Next Story

Most Viewed