- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీకి బిగ్ షాక్.. చైర్మన్, వైస్ చైర్మన్ సహా 11 మంది కౌన్సిలర్ల రాజీనామా
దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party)కి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలు కార్పొరేషన్లు మున్సిపాలిటీలను కోల్పోయి ఆ పార్టీ తాజాగా మరోటి సైతం జారి పోతున్నట్లు సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. తిరుపతి, విశాఖ, నెల్లూరు, ఏలూరు వంటి కార్పొరేషన్లలో ఇప్పటికే వైసీపీ కార్పొరేటర్లు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు(Nidadhavolu)లో వైసీపీ(Ycp) రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారాయి. నిడదవోలు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ సహా 11 మంది కౌన్సిలర్లు రాజీనామా చేశారు. 27 మంది కౌన్సిలర్లతో ఉన్న వైసీపీ బలం తాజా పరిణామంతో 16కు పడిపోయింది. దీంతో నిడదవోలు మున్సిపాలిటీపై కూటమి కన్నుపడింది. రాజీనామా చేసిన వైసీపీ కౌన్సిలర్లతో టీడీపీ(Tdp), జనసేన(Janasena) నాయకులు టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే నిదవోలు మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగిరే అవకాశం ఉందని పలువురు నాయకులు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.