- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయి
దిశ,సత్తుపల్లి : అర్హత గల లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. సత్తుపల్లి స్థానిక క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పెనుబల్లి, వేంసూరు, సత్తుపల్లి మండలాలకు చెందిన 72.మంది లబ్ధిదారులకు రూ.రెండు కోట్ల 95 లక్షల 500 రూపాయల విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ లో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే దిశగా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుందని, త్వరలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు అందిస్తామని, రైతులకు రూ.రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు.
పేద ప్రజలు అనారోగ్యంతో అప్పులపాలు కాకూడదని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా పేదవారిని ఆదుకుంటున్నట్టు తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలను మెరుగుపరిచి పది లక్షల రూపాయల వరకు అందిస్తున్నట్టు చెప్పారు. 200 యూనిట్లు ఉచిత కరెంటు, ఉచిత బస్సు ప్రయాణంతో రాష్ట్రంలో ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, ఐదు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.