INDvsSA: టీ20ల్లో టీమిండియా సంచలనం.. సెంచరీలతో చెలరేగిన భారత బ్యాటర్లు

by Gantepaka Srikanth |   ( Updated:2024-11-15 16:56:02.0  )
INDvsSA: టీ20ల్లో టీమిండియా సంచలనం.. సెంచరీలతో చెలరేగిన భారత బ్యాటర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: సౌతాఫ్రికాలోని జోహన్నబర్గ్ వేదికగా జరుగుతోన్న నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు అదరగొట్టారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(36) పర్వాలేదు అనింపించగా.. సంజు శాంసన్, తిలక్ వర్మ.. సౌతాఫ్రికా బౌలర్లను ఆటాడుకున్నారు. ఇద్దరు సెంచరీలతో చెలరేగారు. టీ20 చరిత్రలో భారీ స్కోరును సైతం నమోదు చేశారు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో మైదానంలో తిలక్ వర్మ సంబురాలు చేశారు. ఓవరాల్‌గా 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది టీమిండియా. సంజు శాంసన్(109), తిలక్ వర్మ(120) పరుగులతో జట్టుకు భారీ స్కోరు అందించారు. సౌతాఫ్రికా బౌలర్లలో లుతో సిపామ్లా ఒక వికెట్ తీయగా.. మిగిలిన బౌలర్లంతా చేతులెత్తేశారు. నాలుగు మ్యాచుల సీరిస్‌లో ఇప్పటికే 02-1తో టీమిండియా లీడ్‌లో ఉంది.

Advertisement

Next Story