ఏపీకి అండగా కేంద్రం.. మరోసారి కీలక హామీ

by srinivas |
ఏపీకి అండగా కేంద్రం.. మరోసారి కీలక హామీ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీకి కేంద్రం మరోసారి భరోసానిచ్చింది. అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పింది. ఆర్థికంగా ఇప్పటికే కేంద్రం పలుమార్లు అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా పలువురు కేంద్రమంత్రులను కలిశారు. రాష్ట్ర పరిస్థితిని వివరించారు. దీంతో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు తెలిపారు. సాగు విషయంలో గోదావరి-పెన్నా ప్రాజెక్టుకు సహాయ సహకారాలు అందిస్తామని కేంద్రమంత్రులు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు, ప్రజల ఇమ్మిగ్రేషన్ సమస్యల పరిష్కారంపైనా సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలుకు సహాయ సహకారాలు అందిస్తామని కేంద్రమంత్రులు చెప్పినట్లు శ్రీకృష్ణదేవరాయులు తెలిపారు. ఏపీలో పెట్టుబడుల విషయంలో విదేశీ కంపెనీలు వచ్చేలా సహకరిస్తామని తెలిపినట్లు చెప్పారు. అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యాన్ని పునరుద్ధరణపైనా కేంద్రమంత్రులు సానుకూల హామీ ఇచ్చినట్లు లావు శ్రీకృష్ణ దేవరాయులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed