- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Water heater : వాటర్ హీటర్ కొంటున్నారా..? మీరు చెక్ చేయాల్సింది ఇదే..
దిశ, ఫీచర్స్ : అసలే చలికాలం. ఉదయంపూట కూల్ వెదర్ కారణంగా చల్లటి నీటితో స్నానం చేయడానికి భయపడుతుంటారు చాలామంది. అందుకోసం ఈ సీజన్‌లో వాటర్ హీటర్ కొనాలనుకుంటారు. అయితే కొనుగోలు చేసేముందు మీకు మీరు తీసుకునే హీటర్ ఎలా ఉంది? మీకు ఏయే ఫీచర్లు అవసరం తదితర విషయాలను ముందుగానే చెక్ చేసి తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఇంకా ఏయే విషయాలను పరిశీలించాలో చూద్దాం.
వాటర్ హీటర్ (Water heater) కొనాలన్న ఆలోచన వచ్చినప్పుడు చాలా మంది ముందుగా దాని ధరను పరిశీలిస్తుంటారు. తక్కువ ధరలో మంచి బ్రాండెడ్ ఉందేమో చూస్తుంటారు. దీంతోపాటు టెక్నికల్‌గా మరికొన్ని విషయాలను పరిగణించాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే వాటర్ హీటర్లలోనూ మూడు రకాలు ఉన్నాయి. ఒకటి స్టోరేజ్ వాటర్ హీటర్, రెండోది ఇన్‌స్టాంట్ వాటర్ హీటర్, మూడవది సోలార్ వాటర్ హీటర్.
స్టోరేజ్ వాటర్ హీటర్ వేడి నీటిని ఎక్కువగా స్టోర్ చేస్తుంది కాబట్టి పెద్ద ఫ్యామిలీ ఉన్నవారికి బాగుంటుంది. ఇక ఇన్‌స్టాంట్ వాటర్ హీటర్ అయితే వెంటనే నీటిని వేడిచేస్తుంది. చిన్న కుటుంబానికి ఇది బెస్ట్. ఇక సోలార్ వాటర్ హీటర్ ఎండ, వేడి వాతావరణంలో కూడా మన్నికగా ఉంటుంది. పర్యావరణానికి హానీ చేయదు. కరెంట్ ఖర్చు కూడా పెద్దగా ఉండదు. అలాగే ఎక్కువగా వాడే వారికి హీటింగ్ ఎలిమెంట్స్, కాపర్ హీటింగ్ ఉండేవి కూడా కూడా లభిస్తాయి. వీటికి కాస్త ధర కూడా ఎక్కువే. దీంతోపాటు గ్లాస్ కోటెడ్ లేదా స్టెయిన్ లెస్ స్టీల్ హీటింగ్ ఎలిమెంట్స్ (Heating elements) ఉన్న వాటర్ హీటర్లు కూడా ఉంటాయి. వీటి ధర కాస్త తక్కువగా ఉంటుంది. ఇక ఏ హీటర్ కొన్నా దానికి ఎనర్జీ రేటింగ్ ఎంత ఉందనే విషయాన్ని తప్పక చెక్ చేయాలంటున్నారు నిపుణులు. సైజ్ పరంగా చూస్తే ఇద్దరు ముగ్గురు కుటుంబ సభ్యులు ఉన్నవారికి 10 నుంచి 15 లీటర్ల వాటర్ హీటర్ సరిపోతుంది. 4 - 6 మంది వరకు ఉంటే 20 నుంచి 25 లీటర్ల వాటర్ హీటర్ కొనుగోలు చేయడం బెటర్ అంటున్నారు నిపుణులు.
*నోట్ : పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించగలరు.