నెట్ స్పీడ్‌ కారణంగా జెట్ స్పీడ్‌లా వస్తున్న ఊబకాయం!

by Kanadam.Hamsa lekha |
నెట్ స్పీడ్‌ కారణంగా జెట్ స్పీడ్‌లా వస్తున్న ఊబకాయం!
X

దిశ, ఫీచర్స్: ఆధునిక యుగంలో టెక్నాలజీ పరిజ్ఞానం రోజు రోజుకు పెరుగుతుంది. ప్రతీ రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని కనుగొంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ టెక్నాలజీ అనేది మనిషి జీవన పరిమాణంలో ఒక భాగంగా మారింది. ఈ రోజుల్లో టెక్నాలజీని వాడని వారంటూ ఎవ్వరూ ఉండరు. ఒకప్పుడు ఇంటర్నెట్ వేగం పరిమితంగా ఉండేది. కాలానుగుణంగా ఇంటర్నెట్ స్వీడ్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. మొబైల్‌‌లో సైతం ఈ హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇంటర్నెట్ పరిమితంగా ఉన్న రోజుల్లో మూవీ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే తక్కువ సమయం పట్టేది. కానీ ఇప్పుడు క్షణాల్లో డౌన్‌లోడ్ అవుతుంది. అయితే, ఈ హైస్పీడ్ ఇంటర్నెట్ అనేది ఊబకాయం సమస్యకు కారణమవుతుందని ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు చెబుతున్నారు.

మోనాష్, మెల్బోర్న్ విశ్వవిద్యాలయం వారు పలు సంవత్సరాలు విశ్లేషించి ఈ విషయాన్ని తెలిపారు. స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫారమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో, ఆన్‌లైన్ గేమింగ్, అతిగా స్కిన్‌ను చూడడం వంటి వాటి ద్వారా ఊబకాయ సమస్య వస్తుందని తెలిపారు. 2006 నుంచి 2019 మధ్యకాలంలో హైస్పీడ్ ఇంట్రనెట్‌ను ఆస్ట్రేలియా మొత్తం విస్తరించింది. ఇది ప్రజల జీవనశైలిలో మార్పులకు కారణమైందని తెలిపారు. ఎక్కువ సమయం స్క్రీన్ చూడడం వల్ల సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం, చిరుతిళ్లు ఎక్కువగా తింటున్నారని, దీంతో వారి ఆహారంలో మార్పులు వచ్చాయని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రతిపాదించిన శారీరక శ్రమ చేయడంపై నిర్లక్ష్యం వహించారని మోనాష్ విశ్వవిద్యాలయం పరిశోధకుడు క్లాస్ మెల్‌బోర్న్ తెలిపారు. దీని కారణంగా ఎక్కువసేపు అలా ఒకే చోట ఉండి స్క్రీన్ చూడడం వల్ల ఊబకాయం వస్తుందన్నారు.

* గంటల తరబడి ఒకే చోట ఉండి ఎక్కువగా స్క్రీన్ చూడడం. దీనికి తోడు సమయానికి ఫుడ్ తినకపోవడం వల్ల ఊబకాయం సమస్యలకు కారణం అవుతుంది.

* హైస్పీడ్ ఇంటర్నెట్ కారణంగా ఆన్‌లోనే గేమ్ ఆడుకోవడం, శరీరానికి కొంత శ్రమ ఇవ్వకపోవడం. దీని వల్ల శరీరానికి శారీరక శ్రమ తగ్గుతోంది. ఇది జీవక్రియపై ప్రభావం చూపుతుంది.

* బయటికి వెళ్లకుండానే ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్‌లో కావల్సిన వస్తువులు, సేవలు సాగిపోతున్నాయి. దీని కారణంగా శారీరక శ్రమ తగ్గుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారానే పలకరించడం వల్ల మానసిక ఆరోగ్యంకు కారణం అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed