IPL 2025 : ముంబై ఇండియన్స్‌కు గుడ్ న్యూస్.. బుమ్రా జట్టులో చేరేది అప్పుడే

by Harish |
IPL 2025 : ముంబై ఇండియన్స్‌కు గుడ్ న్యూస్.. బుమ్రా జట్టులో చేరేది అప్పుడే
X

దిశ, స్పోర్ట్స్ : ముంబై ఇండియన్స్‌కు గుడ్ న్యూస్. ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాకు బీసీసీఐ ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియా టూరులో వెన్ను గాయం బారిన పడిన అతను అప్పటి నుంచి ఆటకు దూరమయ్యాడు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో బుమ్రా పునరావసం పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ముంబై మొదటి నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే, అన్ని ఫిట్‌నెస్ టెస్టులు పూర్తి చేసిన బుమ్రాకు తాజాగా బీసీసీఐ మెడికల్ టీమ్ ఐపీఎల్‌లో పాల్గొనడానికి అనుమతి ఇచ్చినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నెల 7న అతను ముంబై క్యాంప్‌లో చేరనున్నట్టు సమాచారం. అయితే, ఆ రోజు జరిగే బెంగళూరుతో మ్యాచ్‌ అతను ఆడే అవకాశం లేదు. బీసీసీఐ ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ అతను ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడానికి రెండు సిమ్యులేషన్ గేమ్స్ ఆడాల్సి ఉంటుందని తెలుస్తోంది. కాబట్టి, బుమ్రా ఆర్సీబీతో మ్యాచ్‌కు కూడా దూరం కానున్నాడు. ఈ నెల 13న ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో బుమ్రా ఆడే అవకాశాలు ఉన్నాయి.




Next Story